బిగ్ హౌస్‌లో అలీ, శ్రీముఖి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోంది. అది రొమాన్స్‌నో? వైలెన్స్‌నో హౌస్‌మేట్స్‌కే కాదు, బిగ్‌బాస్ రెగ్యులర్‌గా వీక్షిస్తున్న వారికి కూడా తెలియడం లేదు. ఆల్రెడీ హౌస్‌లో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే బాబా భాస్కర్ ఆ మాట అనేశాడు. ఈ మధ్య అలీ, శ్రీముఖి మధ్య కెమిస్ట్రీ శృతి మించిపోతోంది. అన్నింటికీ అలీ, అలీ.. అంటూ శ్రీముఖి వెంటపడుతోంది.
ఇక వీరిద్దరి మధ్యా సరదా సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలూ కూడా జరుగుతున్నాయి. అయితే, అవి నిజంగానే సరదాగా జరుగుతున్నాయా? లేక వైలెంట్‌గా జరుగుతున్నాయా? అనే క్లారిటీ రావడం లేదు. అందుకే అది వైలెన్సా?, రొమాన్సా? అని బాబా ప్రస్థావించేశారు. పెళ్లయిన వ్యక్తితో ఆ టైప్ రొమాన్స్ ఏంటీ? అని బాబా ఫన్నీగా సెటైర్లు వేసేస్తున్నారు.
అలీతో బుంగమూతి పెట్టుకోవడం లేదు కానీ, చీటికీ మాటికీ గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, కాలితో తన్నడం, గిచ్చడం లాంటివి తరచుగా చేస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఏకంగా అలీని కింద పడేసి, ఆయన మీదడిపోయి, మరీ హాట్ రొమాంటిక్ యాక్షన్ చేసేసింది. చూస్తున్న వాళ్లకి ఇదంతా కాస్త తేడాగానే కనిపిస్తుంది మరి. ఇలాంటి రొమాంటిక్ వైలెన్స్ ద్వారా ఎలాంటి సంకేతాలు పంపించాలనుకుంటున్నారు.. అంటూ నెటిజన్స్ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఈ శృతిమించిన రొమాన్స్ ఆర్ వైలెన్స్ పట్ల బిగ్ టీమ్ ఎలాంటి కేర్ తీసుకుంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ!