సాహో చేతికి మరో రికార్డు చిక్కింది. తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో 6వ స్థానం సంపాదించుకుంది. సాహోకి తొలి వారం 350 కోట్ల పైచిలుకు వసూళ్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన టాప్ 6లో సాహో స్థానం దక్కించుకుంది. తొలి 5 స్థానాల్లో బాహుబలి 2, సుల్తాన్, దంగల్, రోబో 2.ఒ, సంజు చిత్రాలున్నాయి.
వాటి సరసన సాహో చేరింది. టాప్ 6లో ఒకే హీరో సినిమాలు రెండు చోటు చేసుకోవడం ప్రభాస్ విషయంలోనే జరిగింది. ఓ విధంగా.. దక్షిణాది మొత్తం గర్వించాల్సిన విషయం ఇది. నెగిటీవ్ టాక్ వచ్చినా, రేటింగులు దారుణంగా ఉన్నా సాహో ఈ స్థాయిలో విజృంభించడం ట్రేడ్ వర్గాల్ని సైతం విస్మయపరుస్తోంది. మరి సాహో జోరు.. ఏ స్కోరు దగ్గర ఆగుతుందో చూడాలి.