సాహో ప్రభంజనం తగ్గింది. సోమవారం వరకూ బాక్సాఫీసు దగ్గర దూసుకెళ్లిపోయిన సాహోకి మంగళవారం అమాంతం స్పీడు బ్రేకర్లు పడ్డాయి. వినాయక చవితి సెలవుదినాన్ని క్యాష్ చేసుకోగలిగిన సాహో... మంగళవారం బాగా డీలా పడింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సాహోకి 3.55 కోట్ల షేర్ మాత్రమే దక్కింది. సోమవారంతో పోలిస్తే 60 శాతం వసూళ్లు డ్రాప్ అయినట్టే లెక్క. నైజాంలో సాహో వసూళ్లు మరింత క్షీణించాయి.
మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల షేర్ వసూలు చేయగలిగింది సాహో. ఈ వారం అంతా కలిపితే షేర్ 200 కోట్ల వరకూ ఉండొచ్చు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో మరో వంద కోట్లు కొల్లగొట్టినా సాహో మొత్తం బిజినెస్ 300 కోట్ల లోపే ఆగిపోతుంది. సాహో బడ్జెట్ 350 కోట్లు అనుకుంటే... ఆ మిగిలిన 50 కోట్లూ.. నిర్మాతలు భరించాల్సిందే.