రూ.350 కోట్లు.. నిజంగా అంత ఖ‌ర్చు పెట్టారా?

మరిన్ని వార్తలు

దేశంలోనే అత్యంత భారీ చిత్రాల‌లో ఒక‌టిగా ప్ర‌మోట్ చేసుకుంది సాహో టీమ్. ఈ సినిమా కోసం 350 కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు, కేవ‌లం యాక్ష‌న్ దృశ్యాల‌కే 200 కోట్ల వ‌ర‌కూ అయిన‌ట్టు లెక్క‌గ‌ట్టారు. ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు నిజంగానే అంత ఖ‌ర్చు పెట్టారేమో అనుకున్నారు జ‌నాలు. కానీ తెర‌పై చూశాక మాత్రం నిజంగా ఇంత అయ్యిందా? అంటూ అనుమానిస్తున్నారు. సినిమా చూశాచ్చాక బ‌డ్జెట్ గురించి చాలామంది ర‌క‌ర‌కాలుగా వ్యాఖ్యానించుకోవ‌డం క‌నిపించింది.

ఈ సినిమా బ‌డ్జెట్ 200 కోట్లు దాట‌ద‌ని, కావాల‌ని ఎక్కువ చెప్పుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం స్టార్ న‌టీన‌టుల్ని ఎంచుకున్నారు. ప్ర‌తీ చిన్న పాత్ర‌కూ పేరున్న‌వాళ్ల‌నే తీసుకున్నారు. కాస్టింగ్ విష‌యంలో కాస్ట్ క‌నిపిస్తోంది. ఛేజింగులు, క్లైమాక్స్ ఫైటు.. వీటి కోసం బాగానే ఖ‌ర్చు పెట్టారు. ఎంత ఖ‌ర్చు పెట్టినా 200 కోట్లు దాట‌ద‌ని సినీ విశ్లేష‌కులు కూడా తేల్చేస్తున్నారు. అయితే ఖ‌ర్చు ఎక్కువ చేసి చూపించ‌డం పెద్ద త‌ప్పేం కాదు. సినిమా కోసం రూపాయి ఖ‌ర్చ‌యితే రూపాయిన్న‌ర అని చెప్పుకోవ‌డం మామూలే.

బ‌డ్జెట్ ఎక్కువ చెబితే దానికి త‌గ్గ‌ట్టుగానే బిజినెస్ జ‌రుగుతుంది. సాహో టీమ్ కూడా అదే చేసింది. నిజంగా ఈ సినిమాకి 200 కోట్ల‌లో పూర్తి చేసున్న‌ట్టైతే.. సాహో టీమ్ అత్యంత భారీ న‌ష్టాల నుంచి త‌ప్పించుకున్న‌ట్టే. వాళ్లు చెప్పిన‌ట్టు 350 కోట్ల‌యితే మాత్రం - యూవీ క్రియేష‌న్స్ తేరుకోవ‌డానికి చాలా కాలం ప‌డుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS