'సాహో' సందడి మామూలుగా లేదోచ్‌!

మరిన్ని వార్తలు

భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందుతోన్న 'సాహో' విడుదల కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందంటే అతిశయోక్తి కాదేమో. ఆగస్ట్‌ 30న 'సాహో' వరల్డ్‌ వైడ్‌గా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది. డార్లింగ్‌ ప్రబాస్‌ పలు ఇంటర్వ్యూస్‌లో హుషారుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్‌ కోసం ప్రబాస్‌ చెన్నైలో సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే, అరుదైన రికార్డును 'సాహో' సొంతం చేసుకుంది. ప్యారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ధియేటర్‌ గ్రాండ్‌ రెక్స్‌లో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు.

 

ఇంతవరకూ ఈ ధియేటర్‌లో సౌత్‌ నుండి 'కబాలి', 'బాహుబలి', 'విశ్వరూపం 2', 'మెర్సల్‌' చిత్రాలను మాత్రమే ప్రదర్శించారు. తదుపరి ఈ లిస్టులో 'సాహో' కూడా చేరబోతోంది. మరోవైపు 'సాహో' ది గేమ్‌ పేరుతో ఓ వీడియో గేమ్‌ని గత వారమే చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ రోజు పూర్తి గేమ్‌ని మార్కెట్‌లోకి వదిలారు. అయితే, ప్రస్తుతం యాపిల్‌ స్టోర్‌లోఒ మాత్రమే ఇది అందుబాటులో ఉంది.

 

యాపిల్‌ మొబైల్‌ వాడే వారెవరైనా ఈ గేమ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు 'సాహో' గేమ్‌ని డౌన్‌ లోడ్‌ చేసుకునేందుకు మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ గేమ్‌లో చివరి లెవల్‌కి చేరుకున్న వారికి సినిమాకి సంబంధించి కొన్ని క్లూస్‌ తెలుసుకునే అవకాశముందట. దాంతో ఈ గేమ్‌ ఆడేందుకు ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS