ఈ ఏడాది విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాల్లో అంచనాలున్న సినిమా 'సాహో'. ఆగస్టు 15న సినిమా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా పోస్టర్స్ వదులుతూ, ప్రమోషన్స్ షురూ చేసింది. అందులో భాగంగా ఆల్రెడీ ఛాప్టర్ 1 పేరుతో టీజర్ వదిలారు. సూపర్ హిట్ అయ్యింది. తర్వాత మేకింగ్ వీడియో వదిలి ఇంకా అంచనాలు నమోదు చేశారు. తర్వాత వస్తున్న పోస్టర్లు ఒక్కొక్కటిగా సినిమాపై అంచనాల్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నాయి.
తాజాగా 'సాహో' నుండి విడుదలైన పోస్టర్ విషయానికి వస్తే, స్టైలిష్ జాకెట్ ధరించి, చెవిలో బ్లూ టూత్, కళ్లకు గాగుల్స్ ధరించి రయ్ రయ్‌మని స్పోర్ట్ బైక్‌లో ప్రబాస్ దూసుకెళ్తున్న పోస్టర్ అది. ఈ పోస్టర్ విడుదలైన కాసేపటికే వ్యూస్ పోటెత్తుతున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ మేకింగ్‌తో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, మందిరాబేడీ, అరుణ్ విజయ్, ఎవిలీన్ శర్మ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.