సాహో ప్రభంజనం బాగా తగ్గిపోయింది. సోమవారంతో పోలిస్తే మంగళవారం వసూళ్లు క్షీణించాయి. బుధవారం ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. 6వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కలిపి కేవలం 1.70 కోట్ల షేర్ మాత్రమే రాబట్టుకుంది. ఓవర్సీస్లో అయితే సాహోకి భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. అక్కడ ఈ సినిమాని 42 కోట్లకు కొన్నారు. అన్ని భాషలూ కలిపి. ఇప్పటికి అక్కడ 25 కోట్లు కూడా రాలేదు.
అంటే దాదాపు 18 కోట్ల నష్టమన్నమాట. సాహోకి నెగిటీవ్ రివ్యూలొచ్చాయి. ప్రతీ రివ్యూలోనూ సాహోని చీల్చి చెండాడారు. ఆ ప్రభావం ఓవర్సీస్ వసూళ్లపై బలంగా పడింది. అందుకే అక్కడ తొలి రోజు నుంచీ - సాహో వసూళ్లు నిదానంగానే సాగాయి. ఇంత డివైడ్ టాక్లోనూ ఓవర్సీస్లో పాతిక కోట్లు రాబట్టడం మామూలు విషయం కాదు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ.. ఇలా నాలుగు వెర్షన్లూ విడుదల చేయడం వల్ల పాతిక కోట్లయినా రాబట్టుకోగలిగింది.