ప్ర‌భాస్ అభిమానుల్లో ఒణుకు పుట్టిన‌స్తున్న 'సాహో' పాట‌.

మరిన్ని వార్తలు

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి సాహో ఓ షాక్ ఇచ్చింది. అయితే ఇదేం స్వీట్ షాక్ కాదు. హాట్ షాకే. సోమ‌వారం `సాహో పాట విడుద‌ల చేస్తున్నార‌న్న సంగ‌తి తెలిసిన‌ప్ప‌టి నుంచీ ప్ర‌భాస్ అభిమానులు పాట కోసం ఆత్రుత‌గా ఎదురుచూడ‌డం మొద‌లెట్టారు. అనుకున్న‌ట్టుగానే `సాహో` నుంచి పాట వ‌చ్చింది. రెండు నిమిషాల వీడియో పాట‌ని చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. సాధార‌ణంగా విడుద‌ల‌కు ఒక‌టీ రెండు రోజుల ముందే వీడియో పాట‌లు బ‌య‌ట‌కు వ‌దులుతారు.

 

కానీ `సాహో` టీమ్ మాత్రం ధైర్యం చేసి వీడియో పాట‌ని విడుద‌ల చేసింది. అయితే ఆ పాట హిందీ డ‌బ్బింగ్ పాట‌లా అనిపించ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ షాక‌య్యారు. `సాహో`ని ముందు హిందీలో తెర‌కెక్కించి, ఆ త‌ర‌వాత తెలుగులో తీసిన‌ట్టు అనిపిస్తోంది ఆ పాట చూస్తుంటే. సాహోని తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో తీస్తున్నామ‌ని చిత్ర‌బృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. రెండు భాష‌ల్లో తీస్తున్న‌ప్పుడు ప్ర‌తీ సీనూ, ప్ర‌తీ పాటా రెండు సార్లు షూట్ చేస్తారు. హిందీ, తెలుగు వెర్ష‌న్లు వేరు వేరుగా ఉంటాయి.

 

అయితే.. ఈ పాట వ‌ర‌కూ మాత్రం హిందీ పాట‌కు డ‌బ్బింగ్ చేసి వ‌దిలారు. పాట‌లో ప‌దాలు కూడా ఏమాత్రం అర్థం కావ‌డం లేదు. దాంతో ప్ర‌భాస్ అభిమానుల్లో ఒణుకు మొద‌లైంది. ఈ పాట ఒక్క‌టీ ఇలా ఉందా? లేదంటే ఆల్బ‌మ్ మొత్తం ఇలానే తీర్చిదిద్దారా? అనే బెంగ పేరుకు పోతోంది. హిందీ ఆడియ‌న్స్‌ని టార్గెట్ చేసిన సినిమా ఇది. అంత మాత్రాన తెలుగుకు అన్యాయం చేయాల్సిన ప‌ని లేదు. సినిమా మొత్తం ఇలానే ఉంటే, సాహో తెలుగు సినిమాలా కాకుండా, డ‌బ్బింగ్ సినిమాలా మిగిలిపోయే ప్ర‌మాదం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS