ప్రభాస్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూసే. ఆగస్టు 15 ఎప్పుడెప్పుడు వస్తుందా? సాహోని వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 30న సాహోని విడుదల చేయాలని చిత్రబృందం ఫిక్సయినట్టు సమాచారం. వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తవ్వని కారణంగా సాహో విడుదలని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. షాహో చిత్రీకరణ ఈ రోజే ముగిసింది. నిర్మాణ కార్యక్రమాలు కూడా వేగవంతం అయ్యాయి. హిందీలో డబ్బింగ్ కొనసాగుతోంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతోందని, గ్రాఫిక్స్ ఇంకా అందలేదని సమాచారం అందుతోంది. మొత్తానికి ప్రభాస్ అభిమానుల్ని మరోసారి సుజిత్, యూవీ క్రియేషన్స్ దారుణంగా నిరాశ పరిచినట్టైంది.