డాన్సులు ఇరగదీసేసిన సంపూర్ణేష్‌బాబు.

మరిన్ని వార్తలు

'హృదయ కాలేయం' అనే సినిమాతో అనూహ్యమైన ఫాలోయింగ్‌ తెచ్చుకున్న నటుడు సంపూర్ణేష్‌బాబు. ఒక్క సినిమాతోనే బర్నింగ్‌ స్టార్‌ బిరుదాంకితుడైపోయాడు. విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. చేసినవి తక్కువ సినిమాలే అయినా, సంపూర్ణేష్‌ని తెలియని వారుండరు. అలాంటి సంపూర్ణేష్‌ నటించిన తాజా చిత్రం 'కొబ్బరి మట్ట' ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కానీ, విడుదలకు నోచుకోలేదింతవరకూ. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు.

 

ఆగస్ట్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌కి కాలు దువ్వింది. ఆ మాటకొస్తే, ఎప్పటికప్పుడే 'కొబ్బరిమట్ట'ను ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తూనే ఉన్నారు. 'రంగస్థలం' సినిమా టైంలో ఓ సారి 'కొబ్బరిమట్ట'ని గుర్తు చేశారు. మహేష్‌ 'భరత్‌ అనే నేను' టైంలో కూడా గుర్తు చేశారు. ఇక ఇప్పుడు విడుదల సందర్భంగా బాగా గుర్తు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి చిత్ర యూనిట్‌ ఓ సాంగ్‌ ప్రోమోని విడుదల చేసింది. 'అ,ఆ..' అంటూ సాగే ఆ సాంగ్‌ ప్రోమోలో సంపూర్ణేష్‌ బాబు డాన్సులు ఇరగదీసేశాడంతే. 'నువ్వు హీరోవేంట్రా బాబూ.. మా ఖర్మ కాకపోతేనూ..' అనుకునేవారికి ఆయన డాన్సులు ఓ గొడ్డలి పెట్టులా సమాధానం చెబుతాయి.

 

'హీరో అంటే ఇంకేంట్రా అనిపించేలా..' ఆయన యాక్టింగ్‌ స్కిల్స్‌ చూపిస్తున్నారు. సినిమా అంటేనే వినోదం.. తన సినిమాతో ఆ వినోదాన్ని పుష్కలంగా పంచగల టాలెంట్‌ సంపూర్ణేష్‌బాబులో ఉందని ఎప్పుడో ప్రూవ్‌ అయిపోయింది. ఇక చూడాలి మరి 'కొబ్బరిమట్ట'తో సంపూర్ణేష్‌ మరోసారి ఎలా ఆకట్టుకుంటాడో. రూపక్‌ రొనాల్డ్‌సన్‌ ఈ సినిమాకి దర్శకుడు. తొలి సినిమా 'హృదయకాలేయం' డైరెక్టర్‌ స్టీవెన్‌ శంకర్‌ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. డిఫరెంట్‌ గెటప్స్‌లో సంపూర్ణేష్‌ బాబు ఈ సినిమాలో కనిపించి మెప్పించనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS