మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది 'సాహో'. ఓ పక్క ప్రచార చిత్రాలతో 'సాహో' టీమ్ హోరెత్తిస్తోంది. మరో పక్క 'సాహో'పై ఉన్న కొన్ని కొన్ని డౌట్స్ బయటికి వస్తున్నాయి. అందులో మొదటిది 'సాహో'లో ప్రబాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడన్న డౌట్. ప్రచార చిత్రాల్లో రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో ప్రబాస్ కనిపిస్తున్నాడు. అండర్ కవర్ కాప్‌గా పవర్ ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నాడు.
మరోపక్క చిల్లరి దొంగలా మాస్ లుక్స్‌లోనూ కనిపిస్తున్నాడు. ఇది చూస్తుంటే, ప్రబాస్ గతంలో నటించిన 'బిల్లా' సినిమాలోని బిల్లా, రంగా అనే క్యారెక్టర్స్‌లా ఈ సినిమాలోనూ రెండు పాత్రల్లో కనిపిస్తాడన్న అనుమానం కలుగుతోంది. మరోవైపు శ్రద్ధాకపూర్ చనిపోతుందా? అనే అనుమానం కూడా ఉంది. ట్రైలర్‌లో 'పగలూ, రాత్రిలా మనమిద్దరం కలిసి ఉండడం కుదరదు. ఒకరు వస్తే, మరొకరు వెళ్లిపోవాల్సిందే..' అని హీరోయిన్ చెబుతున్న డైలాగ్ కూడా ఈ అనుమానానికి బలం చేకూరుస్తుంది. ట్రైలర్‌లో జీవచ్చవంలా ఉన్న హీరోయిన్‌ని చేయి పట్టి, ఎవరో ఈడ్చుకుని వెళుతున్న సీన్ కూడా కట్ చూపించారు.
ఒకవేళ ఫ్యాన్స్ అనుమానం నిజమే అయితే, ఒక ప్రబాస్ క్యారెక్టర్‌నీ, శ్రద్ధాకపూర్ క్యారెక్టర్‌ని చంపేస్తారేమో. అయితే, రెండో ప్రబాస్ కోసం హీరోయిన్ ఎవరై ఉంటారు? ఒకవేళ ఆ పాత్రను సస్పెన్స్‌గా ఉంచారా? లాంటి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొలదీ, ఫ్యాన్స్‌లో ఉత్కంఠ మరీ ఎక్కువైపోతోంది. ఆ ఉత్కంఠ తీరాలన్నా, రేకెత్తిన అనుమానాలు పటా పంచలు కావాలన్నా తప్పదు మరో పది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆగస్ట్ 30న 'సాహో' వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.