టాక్ అఫ్ ది వీక్ – సాక్ష్యం & హ్యాపీ వెడ్డింగ్

By iQlikMovies - July 29, 2018 - 18:29 PM IST

మరిన్ని వార్తలు

ఈ వారం విడుదలైన రెండు చిత్రాలలో ఒకటి భారీ బడ్జెట్ చిత్రం కాగా మరొకటి తక్కువ బడ్జెట్ తో తీసిన చిన్న సినిమా. అయితే ఈ రెండు చిత్రాలకి పనిచేసిన వారికి ప్రేక్షకుల్లో ఆదరణ ఉండడంతో ఈ రెండు చిత్రాలకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

ఇక ఆ రెండు చిత్రాలలో మొదటిది- సాక్ష్యం. పంచభూతాలని మెయిన్ పాయింట్ గా తీసుకుని దానికి ఒక రివెంజ్ కథని జోడిస్తూ కాస్త కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీవాస్. రొటీన్ గా ఎందుకు కథ చెప్పడం, కాస్త వైవిధ్యం జోడిద్దాము అని అనుకుని ఈ “పంచభూతాలు” అంశాన్ని హైలైట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

అయితే ఈ సినిమాలో స్టార్ హీరోని కాకుండా యంగ్ హీరో ని పెట్టుకోవడంతో ఈ సినిమాకి కావాల్సినంత, రావాల్సినంత హైప్ రాలేదు అన్నది నిజం. కెమెరా వర్క్ గురించి ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాలి, కారణం ఈ సినిమా కి కెమెరా పనితనం ఒక ప్లస్ పాయింట్ కాబట్టి.. ఇక దర్శకుడు తను రాసుకున్న కథలో పంచభూతాలని సరిగ్గా అమర్చడం కూడా బాగా కుదిరింది.ఇక సినిమా కి మాత్రం ఆడియన్స్ నుండి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా భవిష్యత్తు ప్రేక్షకుల పైనే ఆధారపడి ఉంది.

ఈ వారం విడుదలైన రెండవ చిత్రం- హ్యాపీ వెడ్డింగ్. నిహారిక, సుమంత్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి మార్కులే కొట్టేసింది. 

సాధారణ కథనే సాధారణంగా, అందరికి అర్ధమయ్యేలా చెప్పడంలో దర్శకుడు విజయం సాధించాడు. నిహారిక నటన, పాటలు ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు అని చెప్పొచ్చు. పెళ్లి కుదిరిన సమయం నుండి పెళ్ళి జరిగే వరకు మధ్య ఒక జంట ప్రయాణాని దర్శకుడు బాగా చూపించాడు.

దర్శకుడు రాసిన కథకి ప్రధాన తారాగణం అందరూ చాలా చక్కగా సహకరించారని ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. మొత్తానికి ఇది ఒక “హ్యాపీ” సినిమా.

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS