మెగాస్టార్ సైరాకి “లీక్” తలనొప్పులు

మరిన్ని వార్తలు

టెక్నాలజీ పెరగడం సినిమా నిర్మాణంలో ఎంతగా ఉపయోగిపడుతున్నదో అదే స్థాయిలో అదే సినిమా నిర్మాణానికి గడ్డుకాలం తెచ్చేలా చేస్తున్నది. ఇందుకు తాజా ఉదాహరణ ఇప్పుడు సినిమా షూటింగ్ సమయంలో జరుగుతున్న లీక్స్.

మొన్ననే ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న అరవింద సమేత చిత్రం షూటింగ్ స్టిల్ లీక్ అవ్వగా నిన్న చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం షూటింగ్ స్టిల్స్ రెండు లీక్ అయ్యాయి. అందులో ఒక స్టిల్ లో బ్రిటిష్ సైన్యం నిలబడి ఉన్నది కాగా మరో స్టిల్ లో మంటల్లో చిక్కుకున్న ఒక కోటని చూడొచ్చు. దీనితో సైరా యూనిట్ ఒక్కసారిగా షాక్ కి గురైంది అని చెప్పొచ్చు.

ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఇలా జరగడంతో అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సంఘటనతో షూటింగ్ వద్ద భద్రత కట్టుదిట్టం చేస్తూ మొబైల్ ఫోన్లని షూటింగ్ జరిగే ప్రదేశానికి చాలా దూరంలోనే వదిలిపెట్టి వచ్చేలా చర్యలు తీసుకోనున్నారట.

చూద్దాం.. ఈ కొత్త చర్యలైనా ఈ లీకులని ఆపుతాయా లేదా..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS