ఈరోజు అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సాక్ష్యం చిత్రం విడుదలకానుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం 8.45 షోలు రద్దు అయ్యాయట.
దీనికి ప్రధాన కారణం నిర్మాత-డిస్ట్రిబ్యూటర్లకి మధ్య ఏర్పడిన విభేదాల కారణంగానే ఇలా జరిగినట్టుగా తెలుస్తున్నది. అయితే వెంటనే ఇందుకు సంబంధించి సాక్ష్యం యూనిట్ రంగంలోకి దిగి వెంటనే దిద్దుబాటు చర్యలకి పూనుకున్నట్టుగా సమాచారం.
దీనితో మధ్యాహ్నం నుండి షోలు యధావిధిగా ప్రదర్శింపబడుతాయి అని ఇప్పుడే తెలుస్తున్న విషయం. ఇక సినిమా విషయానికి వస్తే, దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించిగా అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించి రివ్యూ మరికొన్ని గంటల్లో www.iQlikmovies.com లో చూడండి.