బెల్లంకొండ ఈ సారి గట్టిగా కొట్టాడండీ.!

By iQlikMovies - July 27, 2018 - 17:38 PM IST

మరిన్ని వార్తలు

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌, హాట్‌ బ్యూటీ పూజా హెగ్దే జంటగా తెరకెక్కిన చిత్రం 'సాక్ష్యం'. ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది 'సాక్ష్యం' చిత్రం. ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయి ఈ సినిమాకి. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల షోలు రద్దైనప్పటికీ, ఆనతి కాలంలోనే చిత్ర యూనిట్‌ స్పందించడంతో ఆ సమస్య పెద్ద ఆటంకం కాలేదు. 

ఇకపోతే పంచభూతాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పోజిటివ్‌ టాక్‌నే అందుకుంటోంది. కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది. బాగానే వర్కవుట్‌ అయ్యిందంటున్నారు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ బాగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని పంచభూతాల నేపథ్యానికి కనెక్ట్‌ చేసి చూపించిన విధానం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తోంది. కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కథ రొటీనే అయినా కానీ, పంచభూతాల కాన్సెప్ట్‌ని ఇలా కూడా వాడుకోవచ్చు అనే డైరెక్టర్‌ తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. 

పూజా హెగ్దే నటన, అందం సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పలేరు. కానీ పాటల్లో ఒకలా, సన్నివేశాల్లో మరోలా డిఫరెంట్‌ వేరియేషన్స్‌లో కనిపించింది. అంతేకాదు, బక్క పలచని అందాలతో జీరోసైజ్‌తో ఆకట్టుకుంటోందీ సినిమాలో పూజా. టోటల్‌గా రొటీన్‌ స్టోరీకి ఆధునిక హంగులు, భారీ సెట్టింగులు జోడించి సరికొత్తగా మలిచారు 'సాక్ష్యం'ని. 

ఓపెనింగ్స్‌ బాగానే ఉన్నా, ఫైనల్‌ రిజల్ట్‌ ఎలా ఉండబోతోందో సాయంత్రానికల్లా తేలిపోతుంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS