చిరంజీవి దృష్టి ఇప్పుడు రీమేక్ సినిమాలపై పడింది. తను చేస్తున్న గాడ్ ఫాదర్, భోళా శంకర్ రెండూ రీమేకులే. ఇప్పుడాయన దృష్టి `బ్రో డాడీ`పై పడింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా ఇది. మోహన్ లాల్, ఫృథ్వీరాజ్ తండ్రీ కొడుకులుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో తీసుకొద్దామనుకుంటున్నారు. ఈ సినిమా రీమేక్ బాధ్యతల్ని హరీష్ శంకర్‌కు అప్పగించినట్టు సమాచారం. హరీష్ `బ్రో డాడీ`లో పాయింట్ తీసుకుని, తనవైన మార్పులు చేర్పులూ చేసి, స్క్రిప్టుని తయారు చేసే పనిలో ఉన్నాడని టాక్. చిరంజీవి తనయుడిగా సాయిధరమ్ తేజ్ కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
చిరు తనయుడి పాత్ర కోసం వైష్ణవ్ తేజ్, వరుణ్‌తేజ్ పేర్లు కూడా పరిశీలించారు. అయితే... తేజ్‌లో.. చిరు పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. పైగా ఇది కామెడీ టచ్ ఉన్న పాత్ర. వరుణ్, వైష్ణవ్ కంటే.. సాయిధరమ్ నే కామెడీ బాగా చేయగలడు. అందుకే సాయిధరమ్ ని దాదాపుగా ఫిక్స్ చేసేసినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.