'చిత్ర‌ల‌హ‌రి'లో... హీరోయిన్లు ఎవ‌రో తెలుసా??

By iQlikMovies - November 03, 2018 - 13:32 PM IST

మరిన్ని వార్తలు

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. ఇప్పుడో హిట్టు కొట్ట‌డం అత్య‌వ‌స‌రం. అందుకే కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. 

సాయిధ‌ర‌మ్ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్  ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. అదే... చిత్ర‌ల‌హ‌రి.  కిషోర్ తిరుమ‌ల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. 'నేను శైల‌జ‌'తో ఆక‌ట్టుకున్న ఈ ద‌ర్శ‌కుడు.. 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ'తో ఓకే అనిపించుకున్నాడు. ఇది ముచ్చ‌ట‌గా మూడో ప్ర‌య‌త్నం.

ఇందులో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు చోటుంది. నివేదా పేతురాజ్‌, క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శిని ఇందులో క‌థానాయిక‌లుగా ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. శ్రీ‌విష్ణు సినిమా `నీదీ నాదీ ఒకే క‌థ‌`లో క‌థానాయిక‌గా న‌టించింది పేతురాజ్‌.  అఖిల్ `హ‌లో`లో క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శిని క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. 

ఈ ఇద్ద‌రికీ మ‌రో అవ‌కాశం ద‌క్కింద‌న్న‌మాట‌. అతి త్వ‌ర‌లో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తారు. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS