సునీల్‌ ఇప్పుడు సో బిజీ తెలుసా?

మరిన్ని వార్తలు

మంచి టైమింగ్‌ ఉన్న కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్‌ తర్వాతి కాలంలో 'అందాల రాముడు' సినిమాతో హీరోగా మారాడు. తర్వాత జక్కన్న చేతిలో పడి 'మర్యాద రామన్న' సినిమాతో హీరోగా తిరుగులేని సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఆ తర్వాత 'పూల రంగడు' చిత్రంతో కమర్షియల్‌ యాక్షన్‌ హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. తర్వాత తర్వాత హీరోగా చాలా ఫెయిల్యూర్స్‌ చవి చూశాడు. దాంతో హీరోగా సునీల్‌ కెరీర్‌ చాలా స్లో అయిపోయింది. ఇటు కమెడియన్‌గా సినిమాలు చేయక, అటు హీరోగా సక్సెస్‌లు అందుకోలేక గత కొంతకాలంగా సునీల్‌ సతమతమవుతున్నాడు. దాంతో సునీల్‌ అభిమానులు చాలా డిజప్పాయింట్‌ అవుతున్నారు. ఇక అభిమానుల్ని డిజప్పాయింట్‌ చేయడం ఇష్టం లేక సునీల్‌ ట్రాక్‌ మార్చేశాడు. 

తనకి గతంలో గుర్తింపు తెచ్చిన కామెడీ ట్రాక్‌తోనే మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడట. ఆ క్రమంలోనే మరో కామెడీ హీరో అల్లరి నరేష్‌తో కలిసి ఓ ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ సినిమాకు సైన్‌ చేశాడు. భీమినేని శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉండగానే పలు చిత్రాల్లో సునీల్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వబోతున్నాడట. అలాగే తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ సునీల్‌ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపస్తున్నాడనీ సమాచారమ్‌. 

తాజాగా శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'పడి పడి లేచె' మనసు చిత్రంలో సునీల్‌ కోసం ఓ కొత్త క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశాడట డైరెక్టర్‌ హను రాఘవపూడి. దీంతో పాటు మరిన్ని కొత్త పాత్రలకు సునీల్‌ ఓకే చెప్పబోతున్నాడనీ తెలుస్తోంది. ఏమైతేనేం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న శర్వా సినిమాతో సునీల్‌ అతి త్వరలోనే అభిమానుల్ని మీట్‌ అవ్వనున్నాడన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS