ఫిబ్రవరి 9న మెగా ఫ్యామిలీ నుండి రెండు సినిమాలు రానున్నాయి. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ నటిస్తున్న 'ఇంటెలిజెంట్', మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న 'తొలిప్రేమ'.. ఈ రెండు చిత్రాలూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దాంతో మెగా హీరోల మధ్య పోటీ అంటూ ప్రచారం జరుగుతోంది. కాదు కాదు మేమిద్దరం ఒకే రోజు వచ్చి, కలిసి హిట్ కొడతాం అంటున్నాడు మెగా మేనల్లుడు తేజు.
తేజు హీరోగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఇంటెలిజెంట్'. కథకు తగ్గట్లుగా ఈ చిత్రానికి ఈ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా డైరెక్టర్ వినాయక్ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్‌తో 'ఖైదీ' చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత వినాయక్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.
అయితే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు, ప్రతీక్షణం వినాయక్‌కి చిరంజీవే గుర్తుకొచ్చాడట తేజుని చూస్తే. చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ 'కొండవీటి దొంగ' నుండి 'చమక్ చమక్ చం..' పాటని ఈ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటకి తేజు సూపర్బ్‌గా స్టెప్పులేయనున్నాడట. రొటీన్ సాంగ్స్‌కి భిన్నంగా ఉండే సాంగ్ ఇది. అప్పట్లో చిరంజీవి ఈ సాంగ్‌కి వేసిన స్టెప్పుల సంగతి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు.
అలాగే ఈ సాంగ్‌లో తేజు కోసం డిఫరెంట్ స్టెప్పులు కంపోజ్ చేశారట. అయితే మావయ్య ఎనర్జీని మేనల్లుడు రీచ్ చేయగలడా? మావయ్య గ్రేస్‌ని మేనల్లుడు టచ్ చేయగలడా? ఫిబ్రవరి 9 వరకూ వేచి చూడాల్సిందే.