'సైరా' నుంచి సూప‌ర్ న్యూస్‌

మరిన్ని వార్తలు

మెగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. దాదాపు 14 నెల‌ల నుంచీ ఈ సినిమా సెట్స్‌పైనే ఉంది. షూటింగ్ ఎప్పుడు పూర్త‌వుతుందా..?? టీజ‌ర్ ఎప్పుడొస్తుందా?? అని చిరంజీవి అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈసినిమాకి సంబంధించి రీషూట్లు జ‌రుగుతున్నాయ‌ని, అందుకే సినిమా ఆల‌స్యం అవుతోంద‌న్న వార్త‌లు వాళ్ల‌ని బాగా క‌ల‌వ‌ర పెట్టాయి. అయితే ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది.

 

`సైరా` షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. మ‌రో ప‌ది రోజులు షూటింగ్ చేస్తే.. సినిమా పూర్త‌యిన‌ట్టే. త్వ‌ర‌లో టీజ‌ర్‌నీ విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. అంత‌కు ముందు ఒకొక్క‌రి లుక్కూ బ‌య‌ట‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. చిరంజీవి పాత్ర‌కు సంబంధించిన అఫీషియ‌ల్ లుక్ ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేదు. దాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది.

 

ఈ యేడాది అక్టోబ‌రులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో త‌యార‌వుతోంది. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. మొత్తానికి చిరు సినిమా ముగింపుకు చేరుకుంది. ఇక ప్ర‌మోష‌న్ హ‌డావుడి మొద‌లైపోతుంద‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS