తేజూ.! మరీ ఊరించేస్తున్నావ్‌.!

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ తాజా చిత్రం 'తేజ్‌ ఐ లవ్‌యూ'. జూలై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు వేగవంతం చేసింది. పోస్టర్స్‌, టీజర్‌ సరికొత్తగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. తేజు బాడీ లాంగ్వేజ్‌, క్లీన్‌ రొమాంటిక్‌ యాంగిల్‌ చాలా చాలా బాగున్నాయ్‌. 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తేజు గత చిత్రాలైన 'విన్నర్‌' కావచ్చు, 'జవాన్' కావచ్చు, 'ఇంటెలిజెంట్‌' కావచ్చు రిలీజ్‌కి ముందు చాలా చాలా హైప్‌ క్రియేట్‌ చేసినవే. కానీ ఇవేమీ నిలదొక్కుకోలేకపోయాయి. అంచనాలను అస్సలు అందుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు మరోసారి తేజు అలాగే అభిమానుల్ని ఊరిస్తున్నాడు 'తేజ్‌ ఐ లవ్‌యూ'తో. ఈ సినిమాతోనైనా సక్సెస్‌ అందుకుంటాడో.? లేదో.? కానీ ఖచ్చితంగా హిట్‌ కొట్టాలి. లేదంటే రేసులో చాలా వెనకబడిపోతాడు. 

వరుస సినిమాలు చేస్తున్నా సక్సెస్‌లు లేక ఇప్పటికే రేసులో బాగా వెనకబడ్డాడు. అయితే తాజా చిత్రానికి ప్రీ రిలీజ్‌ టాక్‌ చాలా బాగుంది. లవ్‌ స్టోరీస్‌ని విజయవంతంగా తెరకెక్కించడంలో మంచి అనుభవం ఉన్న కరుణాకరన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. క్యూట్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ తేజుతో జోడీ కడుతోందీ సినిమాలో. 

ఇకపోతే మెగా ఫైట్‌ ఉండకూదని చిరంజీవి, కళ్యాణ్‌దేవ్‌ హీరోగా పరిచయవుతున్న 'విజేత' సినిమాను వెనక్కి పంపించినట్లుగా తెలుస్తోంది. అది కూడా సాయి ధరమ్‌ తేజ్‌ రిక్వెస్ట్‌తోనేనట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS