సుప్రీమ్ జోడీ.. మ‌ళ్లొక‌సారి!

By iQlikMovies - June 19, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

హిట్ సినిమాల్లో న‌టించిన జోడీని మ‌ళ్లీ తెర‌పైకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. అదో సెంటిమెంట్‌గా మారుతూ వ‌స్తోంది. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతోంది. సాయిధ‌ర‌మ్ తేజ్ - రాశీఖ‌న్నాల జోడీని మ‌రోసారి చూపించేందుకు రంగం స‌మాయాత్త‌మైంది. వీరిద్ద‌రూ క‌ల‌సి ఇది వ‌ర‌కు `సుప్రీమ్‌` కోసం జంట క‌ట్టారు. ఆ సినిమా హిట్టైంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రి కెమిస్ట్రీ చూసే అవ‌కాశం ద‌క్కుతోంది.

 

సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయకుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. `ప్ర‌తీరోజూ పండ‌గే` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా రాశీఖ‌న్నాని ఎంచుకున్నారు. ఈనెల 28 నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో రాశీ ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌బోతోంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS