'సాహో'ని ఒప్పుకోవడానికి కారణమిదే - శ్రద్ధాకపూర్‌

మరిన్ని వార్తలు

'సాహో'తో టాలీవుడ్‌కి పరిచయమవుతున్న బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్‌. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిన శ్రద్ధాకపూర్‌ 'సాహో'ని ఒప్పుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. 'బాహుబలి'తో ప్రబాస్‌ ప్యాన్‌ ఇండియన్‌ స్టార్‌ అయిపోయాడనే కారణం ఒకటైతే, ఇంకోటీ ఈ సినిమాలో శ్రద్ధాకి సూచించిన క్యారెక్టర్‌ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌. ఆ క్యారెక్టర్‌ కోసమే శ్రద్ధా ఆఫర్‌ రాగానే ఒప్పేసుకుందట. బాలీవుడ్‌లో చాలా చాలా విభిన్న పాత్రలు పోషించిన శ్రద్ధాకి ఇంతవరకూ పోలీస్‌ క్యారెక్టర్‌ రాలేదట. 'సాహో'లో పోలీస్‌ అనగానే ముందూ వెనకా చూడకుండా ఒప్పేసుకున్నాననీ చెబుతోంది.

 

కష్టాల్లో ఉన్న హీరోయిన్‌ని ప్రాణాలకు తెగించి కాపాడే హీరో స్టోరీగా 'సాహో' తెరకెక్కుతోంది. కష్టాల్లో ఉంది కదా.. అని హీరోయిన్‌ ఏమంత తక్కువ కాదండోయ్‌. ఇదిగో చూశారుగా పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌. ఏం పోలీసులకు కష్టాలుండవా.? అంటే బోలెడన్ని కష్టాలు.. ఈ సినిమాలో హీరోయిన్‌ని చూస్తే అవి ఏ టైపుె కష్టాలో తెలిసిపోతాయి మరి. ఇటీవల విడుదలైన 'సాహో' టీజర్‌లో శ్రద్ధా పోలీసాఫీసర్‌ అయ్యుంటుంది అని అర్ధమైంది కానీ, మఫ్టీలో ఉండడంతో క్లారిటీ లేదు. ఇప్పుడు శ్రద్ధా స్వయంగా తన క్యారెక్టర్‌ రివీల్‌ చేసింది. దాంతో కన్‌ఫామ్‌ అయిపోయింది. సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సాహో'ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోంది. భారీ బడ్జెట్‌ యాక్షన్‌ చిత్రంగా 'సాహో' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి గిబ్రాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS