ఫెయిల్యూర్స్‌ని ముందే ఎవరూ ఊహించలేరు. ఒకవేళ ఊహించగలిగితే, అలాంటి ఫెయిల్యూర్ ఎదురుకాకుండా జాగ్రత్త పడతారు. ఇది, తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ చెప్పే మాటే. అయితే సినిమా ఫైనల్ ఔట్ పుట్ చూసుకునేవరకూ మాత్రం, సినిమాపై ఓ అవగాహనకు రాలేకపోవడం జరుగుతుంటుంది. ఔట్ పుట్ చూసుకున్నాక, చేయడానికేమీ వుండదు.
'నోటా' సినిమా విషయంలో, హీరో విజయ్ దేవరకొండ 'ఔట్ పుట్' చూసుకున్నాక, ఆందోళన చెందాడట. అత్యంత సన్నిహిత వర్గాల సమాచారం లేటెస్ట్‌గా బయటకు పొక్కింది. దాంతో, సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుతూ, రాజకీయ పార్టీలపై అగ్రెసివ్‌గా వ్యవహరిస్తూ.. ఇంటర్వ్యూల్లో హల్‌చల్ చేశాడట విజయ్ దేవరకొండ.
అభిమానుల్ని ఉద్దేశించి ట్వీట్లు, సినిమా రిలీజ్ డేట్‌పై హంగామా.. ఇవన్నీ విజయ్, సినిమా ఔట్‌పుట్ చూశాక చేసినవేనని అంటున్నారు. ఎలాగైతేనేం, సినిమా విడుదలయ్యిందిగానీ.. అంచనాల్ని అందుకోలేకపోయింది. దీన్నొక డిజాస్టర్ మూవీగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తోంటే, ఓపెనింగ్స్ అద్భుతమంటూ 'రౌడీస్' (విజయ్ అభిమానులు) ఇప్పటికీ చెబుతూనే వున్నారు. కొందరైతే, సినిమా పెద్ద హిట్ అయ్యిందనీ.. కొందరు కుట్రపూరితంగా తొక్కేసారన్న నమ్మకం ప్రదర్శిస్తున్నారు.
ఎవరు ఏం చెప్పినా, సినిమాకి దారుణమైన ఫలితం వచ్చింది. దాంతో, సినిమాలో కొన్ని సీన్స్ కట్ చేసి కూడా ప్రదర్శించాల్సి వస్తోంది. నిజానికి ఈ ఫ్లాప్ విజయ్ దేవరకొండకి మంచిదే. ఎందుకంటే, తదుపరి చిత్రానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదొక హెచ్చరికగా ఉపయోగపడ్తుంది. సినీ పరిశ్రమలో ఎవరూ జయాపజయాలకు అతీతం కాదు.
సో, సినిమా రిజల్ట్ గురించి విజయ్‌కి రిలీజ్‌కి ముందే జడ్జిమెంట్ రావడం తప్పు కాదు.. ఫలితాన్ని ఊహించి, ఎగ్రెసివ్‌గా ప్రమోట్ చేయడమూ తప్పు కాదు. కానీ, అతని ఇమేజ్‌ని అంచనాలకు మించి ఊహించేసుకోవడంతో భారీగా కొనుగోళ్ళు చేసినవారు నష్టపోవాల్సి రావడం మాత్రం తప్పిదమే.