రాజా ది గ్రేట్ చిత్రంతో రవితేజకి సూపర్ హిట్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు మరొక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.
దీనికి ఇప్పటికే F2 అనే టైటిల్ పెట్టడం అందులో ఒక హీరోగా విక్టరీ వెంకటేష్ ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ తో పాటుగా మరో యంగ్ హీరో కనపడనున్నాడు అన్న సంగతి విదితమే. ఇప్పుడు ఆ రెండవ హీరోగా సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ని సెలెక్ట్ చేసినట్టు తాజా సమాచారం.
అయితే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఇక అనిల్ రావిపూడికి సాయి ధరం తేజ్ తో సుప్రీమ్ సినిమా కోసం పనిచేసిన అనుభవం ఉండడంతో ఈ సినిమాలో రెండవ హీరోగా ఆయనని తీసుకున్నట్టు తెలుస్తున్నది.
మొత్తానికి వెంకీ-తేజుల ద్వయం ఎటువంటి ఫన్ పండించనుందో తెలియాలి.