మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మెగాస్టార్‌తో 'ఖైదీ నెం 150' సినిమాతో వినాయక్ వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. పక్కా మాస్ యాక్షన్ మూవీ అట ఇది. వినాయక్ మాస్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా చిరంజీవిని పక్కా మాస్ హీరోగా చూపించి సూపర్ సక్సెస్ అయ్యాడు వినాయక్. మెగా ఫ్యామిలీ అంటే వినాయక్‌కి ప్రత్యేకమైన అభిమానం. ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న వినాయక్‌కి తన 150వ సినిమా ఛాన్స్ ఇచ్చి తానేంటో నిరూపించుకునే అవకాశం కల్పించాడు చిరంజీవి. అందుకే చిరంజీవిపై ఉన్న భక్తిని చాటుకున్నాడు వినాయక్. ఇప్పుడు మరోసారి మెగా హీరోతోనే సినిమా చేస్తుండడం వినాయక్ అదృష్టం. సి. కళ్యాణ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా ప్రారంభోత్సవం కాగానే చిత్ర యూనిట్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. మరో పక్క మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ 'జవాన్' సినిమాలో నటిస్తున్నాడు. బి.వి.ఎస్ రవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' ఫేం మెహరీన్ కౌర్ ఈ సినిమాలో తేజుకి జంటగా నటిస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాల ప్రేక్షకుల ముందుకు రానుంది.