వినాయక్ - తేజు కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి 'ఇంటెలిజెంట్' అనే టైటిల్‌ని అనుకున్నారు. తాజాగా మరో టైటిల్ ప్రచారం అవుతోంది. అదే 'ధర్మాభాయ్'. ఈ టైటిల్ పట్ల చిత్ర యూనిట్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క మరో రెండు టైటిల్స్ ఈ సినిమాకి పరిశీలనలో ఉన్నాయట.
పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోందీ సినిమా. ప్రస్తుతానికి టైటిల్ విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. కానీ త్వరలోనే ఈ సస్పెన్స్ వీడనుందనీ చిత్ర యూనిట్ ప్రకటించింది. రాశీఖన్నా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్‌తో జత కడుతోంది. ఇటీవలే 'జవాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు తేజు. ఇదో క్లాస్ మూవీ. వినోదానికి అంతగా చోటు లేదు ఈ సినిమాకి. అయితే ఆ టైటిల్‌కి అది యాప్ట్. డిఫరెంట్ అండ్ సీరియస్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా 'జవాన్'. పోజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది.
ఒక క్లాస్, ఒక మాస్ ఇలా ఓ పక్కా ఫార్ములాతో వెళ్తున్నాడు తేజు. కథల్ని ఎంచుకోవడంలో చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి కథల్ని ఎంచుకుంటున్నాడు. వినాయక్‌తో చేయబోయే సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ కానుందట. తేజు మార్క్ డాన్సులు, వినాయక్ మార్క్ హీరో స్టైల్ ఈ సినిమాలో కనిపించనున్నాయట.
అలాగే మనోడు నెక్స్ట్ చేయబోయే చిత్రం ఓ క్యూట్ లవ్‌స్టోరీ. లవ్ స్టోరీస్‌కి పెట్టింది పేరైన కరుణాకరన్‌తో తేజు తదుపరి చిత్రమన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రొమాంటిక్ హిట్ కొట్టాలన్నదే తేజు ఆలోచన. పవన్ కళ్యాణ్‌తో 'తొలిప్రేమ' చిత్రాన్ని తెరకెక్కించి సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ కరుణాకరన్. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మెగా కాంపౌండ్ హీరోతో మరోసారి 'తొలప్రేమ'లాంటి హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అనుపమా పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.