నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో#BB3 అనే సినిమాలో నటిస్తున్నారు. కరోనా క్రైసిస్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగును మరో రెండు నెలల్లో తిరిగి ప్రారంభించనున్నారు. ఈ సినిమా సంగతి ఇలా ఉంటే బాలయ్య తదుపరి చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.
బాలయ్య - బి.గోపాల్ కాంబినేషన్లో త్వరలో ఒక సినిమా రానుందని ఈ మధ్య టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కథను తయారు చేసే బాధ్యత స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్ కు అప్పగించారట. ఆయన ఇప్పటికే ఒక మంచి కథను సిద్ధం చేశారని, త్వరలో బాలయ్య కు వినిపించబోతున్నారని అంటున్నారు. ఒకవేళ ఈ కథ బాలయ్యకు నచ్చిన పక్షంలో నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టేనని అంటున్నారు.
బాలయ్య - బి గోపాల్ కాంబినేషన్ లో గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం బి.గోపాల్ దర్శకత్వం వహించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. కొంతకాలంగా ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. మరి బుర్రా సాయిమాధవ్ వినిపించే కథ బాలయ్యకు నచ్చుతుందా? బి.గోపాల్ బాలయ్య కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అవుతుందా లేదా తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.