మెగా 'సూర్యకాంతం' నయా అవతారం.!

మరిన్ని వార్తలు

మెగా డాటర్‌ నిహారిక సూర్యకాంతం అవతారమెత్తేసింది. అంటే విలన్‌ పాత్రలో ఏమైనా నటిస్తోందా.? ఏంటీ.? అని ఆశ్చర్యపోకండి. అంతేలే సూర్యకాంతం అంటే మనకు గుర్తొచ్చేది, గయ్యాలీతనం. అదే గయ్యాలీతనాన్ని ఇప్పుడు మెగా డాటర్‌ చూపించబోతోంది తన 'సూర్యకాంతం' సినిమా ద్వారా. షార్ట్‌ ఫిలింస్‌ డైరెక్టర్‌ ప్రణీత్‌.బి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్‌లుక్‌ని చిత్ర యూనిట్‌ తాజాగా విడుదల చేసింది. 

 

టూ షేడ్స్‌లో చూపించిన ఈ ఫస్ట్‌లుక్‌ వెరీ వెరీ ఇన్నోవేటివ్‌గా ఉంది. దాన్ని డిజైన్‌ చేసిన విధానం చాలా క్రియేటివ్‌గా ఉంది. టూ హాఫ్స్‌ డిజైన్‌ అది. ఒకటి వైట్‌ రెండోది బ్లాక్‌ అన్నమాట. వైట్‌ హాఫ్‌ విషయానికి వస్తే ఈ హాఫ్‌లో వైట్‌ కలర్‌ డ్రస్సులో, భుజం మీద వైట్‌ కలర్‌ టాటూతో కనిపిస్తున్న నిహారిక హీరోను ప్రేమగా హగ్‌ చేసుకుంటోంది. ఇక రెండో హాఫ్‌లో టైటిల్‌కి యాప్ట్‌ అన్నమాట. అంటే సూర్యకాంతంలా గయ్యాలీలా హీరోపై విరుచుకుపడుతోంది. పళ్లు పటపటా కొరుకుతూ, జుట్టు పీకుతూ వీరంగం సృష్టిస్తోంది. ఇలా ఈ ఫస్ట్‌లుక్‌ని డిజైన్‌ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. 

 

ఈ సినిమాకి వరుణ్‌తేజ్‌ సమర్పకునిగా వ్యవహరిస్తుండడం విశేషం. నిహారిక మూడో చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫుల్‌ ఫన్నీ కంటెన్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందనే విషయాన్ని ఈ ఫస్ట్‌లుక్‌తో చెప్పకనే చెప్పేశారు. 'ఒక మనసు', 'హ్యాపీ వెడ్డింగ్‌' చిత్రాలతో సరిగా ఆకట్టుకోలేని నిహారిక మూడో సినిమాకి గయ్యాలీ సూర్యకాంతంగా వచ్చేస్తోంది. ఈ సినిమా హిట్‌ చేయకుంటే మాత్రం ఫస్ట్‌లుక్‌లో కనిపిస్తున్న హీరోలానే మనం కూడా ఆమె గయ్యాలీతనానికి బలి కావల్సిందే.. అమ్మో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS