పవన్ కల్యాణ్ తో `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మరో కథానాయకుడిగా రానా నటిస్తారు. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంచుకునే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే నిజమైంది.
ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం సాయి పల్లవిని ఎంచుకున్నారు. అయితే అధికారిక సమాచారం అందాల్సివుంది. `అయ్యప్పయుమ్ కోషియమ్`లో కథానాయిక పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు.కానీ తెలుగులో కొన్ని మార్పులు చేర్పులూ జరిగాయి. అందులో భాగంగా కథానాయిక పాత్ర నిడివి పెరిగింది. అందుకే సాయిపల్లవి లాంటి స్టార్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. `వకీల్ సాబ్` సినిమా పూర్తయిన వెంటనే.. పవన్ ఈ సినిమాని పట్టాలెక్కించే ఛాన్సుంది.