సుధీర్ బాబు 'శ్రీదేవి సోడా సెంట‌ర్' ఫస్ట్ లుక్

మరిన్ని వార్తలు

భ‌లే మంచి రోజు, ఆనందో బ్రహ్మా, యాత్ర వంటి సూపర్ హిట్స్ సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందించిన 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ మ‌రోసారి ఓ వినూత్న‌మైన సినిమా రూపొందించ‌డానికి రెడీ అవుతున్నారు. స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌లు విజయ్ చిల్లా, శిశిదేవి‌రెడ్డి సంయుక్తంగా ప‌లాస 1978 వంటి సూప‌ర్ హిట్ క‌ల్ట్ మూవీని తెర‌కెక్కించిన హ్యాపెనింగ్ డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెం 4 గా శ్రీదేవి సోడా సెంట‌ర్ తెర‌కెక్క‌నుంది.

 

నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శిదేవిరెడ్డి తీసిన తొలి చిత్రం భ‌లే మంచి రోజులో హీరోగా న‌టించి 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ కి తొలి విజ‌యాన్ని అందించ‌డ‌మే కాకుండా త‌న ఖాతాలో కూడా సూప‌ర్ హిట్ వేసుకున్న మ‌ల్టీటాలెంటెడ్ సుధీర్ బాబు గారు శ్రీదేవి సోడా సెంట‌ర్ తో మ‌రోసారి ఈ బ్యాన‌ర్ లో న‌టిస్తున్నారు. అయిదేళ్లు తరువాత‌ సుధీర్ బాబు గారు హీరోగా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో తెర‌కెక్క‌తున్న మ‌రో సినిమా శ్రీదేవి సోడా సెంట‌ర్. ఈ సినిమాకు సంబ‌ధించిన టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్టర్ ను అక్ట‌బోర్ 30న‌, సాయంత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల చేశారు చిత్ర బృందం.

 

ఈ మోష‌న్ పోస్ట‌ర్ కి లీడ్ ఇస్తూ తాజాగా విడుద‌ల చేసిన ప్రీలుక్ లో గోలీసోడాల కేస్, జిమ్కీలైట్లు, వైర్లు, మ‌ల్లేపూలె వంటి ఎలిమెంట్స్ పెట్టి ఆడియెన్స్ లో ఉత్కంఠ క‌లిగించిన చిత్ర బృందం ఇప్పుడు కూడా అదే పంధాని కొన‌సాగించారు. శ్రీదేవి సోడా సెంట‌ర్ మోష‌న్ పోస్ట‌ర్ లో బ్యాక్ గ్రాండ్ స్కోర్ సుధీర్ బాబు సోడా ప‌ట్టుకొని ఉన్న స్టిల్, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కి నచ్చే రీతిన ఉంది. అలానే మోష‌న్ పోస్టర్ మొత్తం క‌ల‌ర్ ఫుల్ గా ఉండ‌ట‌మే కాకుండా ఓ జాత‌ర జ‌రుగుతుందా అన్న‌ట్లుగా రంగుల రాట్నం, జ‌యంట్ వీల్ ఇలా అనేక క‌మ‌ర్షీయ‌ల్ ఎలిమెంట్స్ తో ఈ పోస్టకి మాస్ అప్పీల్ వచ్చేలా రెడీ చేశారు 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ టీమ్. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యూల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ లో మొద‌లుపెడుతున్న‌ట్లుగా నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శిదేవిరెడ్డి తెలిపారు. ఈ సినిమాకు మెలోడి కింగ్ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించ‌బోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS