నాని-సాయిపల్లవి ఒన్స్ మోర్!

మరిన్ని వార్తలు

న్యాచురల్ స్టార్ నాని గ్యాప్ లేకుండా సినిమాలు చెయ్యడంలో స్పెషలిస్ట్. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'V' రిలీజుకు రెడీగా ఉంది. ఈ సినిమాతో పాటుగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' చిత్రంలో నటిస్తున్నారు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ తో 'శ్యామ్ సింగరాయ్' సినిమాకూడా లైన్లో ఉంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

 

ఈ సినిమాలో నానికి జోడీగా సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో సాయి పల్లవి ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓ పీరియడ్ కథాంశంతో తెరకెక్కుతుందని, కలకత్తా నగర నేపథ్యంలో కథ సాగుతుందని అంటున్నారు. ఇందుకోసం అలనాటి కలకత్తా నగరం ప్రతిబింబించేలా ఒక సెట్ కూడా వేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారట.

 

ఇదిలా ఉంటే నాని - సాయి పల్లవి మొదటిసారి 'ఎంసిఎ' సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఈసారి నాని-సాయి పల్లవి జోడీ ఎలాంటి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS