అభిమాన నటున్ని దూరంగా చూస్తేనే ఎంతో మజా ఫీల్ వస్తుంది. అలాంటిది తన అభిమాన నటునితో కలసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశమొస్తే ఇంకెలా ఉంటుంది? మాటల్లో చెప్పలేం కదా. అలాంటి ఫీలింగే మన 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవికి కల్గిందట.
ఆమె అభిమాన హీరో సూర్య అని గతంలోనే ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చెప్పింది. స్కూల్ స్టడీస్ టైం నుండే సాయి పల్లవికి సూర్య అంటే ఇష్టమట. అలాంటిది ఇప్పుడు ఆమె సినిమాల్లోకి రావడం, తన ఫేవరేట్ హీరో సూర్య సరసన నటించడం ఇవన్నీ ఓ కలగా ఉందని అంటోంది సాయి పల్లవి. ఫస్ట్ డే సెట్‌లో సూర్యను చూసినప్పుడు సాయిపల్లవికి కలిగిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిదట. అందుకే ఆమె నోట మాట రాలేదని చెబుతోంది.
సాయి పల్లవి ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. వాటిలో ఒకటి సూర్య హీరోగా తెరకెక్కుతోన్న 'ఎన్‌జీకే'. ఈ సినిమా షూటింగ్ విశేషాలనే సాయిపల్లవి అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో ఛాన్స్ రావడమనేది తనకింకా కలగానే ఉందని అంటోంది. అస్సలు నమ్మలేకపోతున్నానంటోంది అందుకే 'ఎన్‌జీకే' మూవీ తన కెరీర్‌కే స్పెషల్ అండ్ స్వీట్ మెమరీ అంటోంది సాయి పల్లవి. ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు, మరో ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తోంది. అలాగే తమిళంలో మరో క్రేజీయెస్ట్ హీరో ధనుష్ సరసన 'మారి 2' చిత్రంలోనూ సాయి పల్లవి నటిస్తోంది.