మలర్ బ్యూటీ సాయి పల్లవి టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఆమెలో ఏం మ్యాజిక్ ఉందో తెలీదు కానీ, హీరోయిన్‌కి ఉండాల్సిన గ్లామర్ అప్పీల్ లేకున్నా, అందర్నీ మాయ చేసేస్తుంటుంది. సమ్‌థింగ్ డిఫరెంట్ ఎట్రాక్షన్ సాయి పల్లవి దాగుంది. అంతేకాదు, తన పక్కన నటించిన ఏ హీరోనైనా సాయి పల్లవి ఈజీగా డామినేట్ చేసేస్తుంది.. అనే టాక్ కూడా ఉంది. అది ఆమె యాక్టింగ్ టాలెంట్ గొప్పతనం. అప్పియరెన్స్‌లోని మాయా జాలం. ఇవే ఆమెకు ప్లస్ పాయింట్స్. అలాగే అవే ఆమె కెరీర్‌కి మైనస్ పాయింట్స్ కూడా. ఎప్పుడో స్టార్ హీరోయిన్స్ రేంజ్‌ని అందుకోగల సత్తా సాయి పల్లవి లో ఉన్నప్పటికీ ఈ కారణంతోనే రేస్‌లో వెనకబడిపోతోంది.
చిన్న హీరోలకు ఆప్షన్‌గా మాత్రమే మిగిలిపోతోంది. గతంలో హీరో నాగశౌర్య, సాయి పల్లవి ఆటిట్యూడ్‌పై పలు రకాల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మాటకొస్తే, సాయి పల్లవి ఏ సినిమాలో నటించినా ఇలాంటి విమర్శలు వినాల్సి వస్తుంది. తాజాగా ఆమె నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ విషయంలోనూ ఇలాంటి విమర్శలే ఆమెను వెంటాడుతున్నాయట. నాగచైతన్య కూడా సాయి పల్లవి డామినేషన్‌ని తట్టుకోలేక తెర వెనుక విమర్శలు చేస్తున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ గుసగుసల్లో నిజమెంతో కానీ, సాయి పల్లవి మాత్రం అలాంటి అమ్మాయ్ కాదంటూ ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల వెనకేసుకొస్తున్నారట. నిజానికి సాయి పల్లవిది అలాంటి మనస్తత్వం కాదని ఆమె సన్నిహితులు కూడా చెబుతుంటారు. బహుశా గిట్టని వాళ్లు చేసే దుష్ప్రచారమే కాబోలు ఇదంతా.