రికార్డు సృష్టిస్తున్న రౌడీ బేబీ.!

మరిన్ని వార్తలు

ధనుష్‌తో సాయి పల్లవి స్టెప్పులేసిన ‘మారి 2’ మూవీలోని ‘రౌడీ బేబీ..’ సాంగ్‌ యూ ట్యూబ్‌లో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రికార్డులు కొల్లగొట్టిన ‘ఫిదా’లోని ‘వచ్చిండే..’ సాంగ్‌ రికార్డుల్ని ఈ సాంగ్‌ బీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కొత్త రికార్డు సృష్టించేందుకు సాయి పల్లవి రెడీ అయిపోతోంది. నాగచైతన్య ` సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘లవ్‌ స్టోరీ’ మూవీ నుండి లేటెస్ట్‌గా రిలీజైన ‘ఏయ్‌ పిల్లా..’ సాంగ్‌ ఇప్పుడు రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. విడుదలైన 24 గంటల్లోనే మూడు మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించి సక్సెస్‌ఫుల్‌గా రన్‌ రేట్‌ క్రియేట్‌ చేస్తోంది. ఆడియోతో పాటు, విజువల్‌గానూ ఈ సాంగ్‌ ఊరిస్తుండడంతో వ్యూస్‌ పోటెత్తుతున్నాయి.

 

వీడియోలో సాయి పల్లవి అప్పియరెన్స్‌ని చాలా కవితాత్మకంగా చూపించారు డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. దాంతో యూత్‌కి ఈ పాట ట్రెండిరగ్‌ అయ్యింది. ‘ఫిదా’ సూపర్‌ హిట్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల చేస్తున్న సినిమా ఇది. సెంటిమెంట్‌గా సాయి పల్లవినే ఈ సినిమాకీ హీరోయిన్‌గా తీసుకోవడం,అనూహ్యంగా ఫస్ట్ టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తుండడంతో, సినిమాపై శేఖర్‌ కమ్ములకు మరింత కాన్ఫిడెన్స్‌ పెరిగిపోయిందట. మరోవైపు ‘మజిలీ’, ‘వెంకీ మామ’ చిత్రాతో వరుస హిట్స్‌ కొట్టిన చైతూ, ఈ సినిమాతో హ్యాట్రిక్‌ హీరో అనిపించుకోవడం ఖాయమంటున్నారు. చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS