నక్సలైట్‌గా మారనున్న సాయిపల్లవి.!

మరిన్ని వార్తలు

కెరీర్‌ తొలుత నుండీ విభిన్న పాత్రలను ఎంచుకుంటూ నటనకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ముద్దుగుమ్మ సాయిపల్లవి. ఎలాంటి బరువైన పాత్రైనా, ప్రాధాన్యత ఉన్న పాత్రైతే వెంటనే ఓకే చేసేస్తుంది సాయిపల్లవి. తాజాగా సాయి పల్లవి ఓ డిఫరెంట్‌ స్టోరీకి సైన్‌ చేసిందనీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్‌. 

 

భళ్లాలదేవుడు రానా ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడట. వేణు ఉడుగుల దర్శకత్వం వహించనున్నాడట. ఈ సినిమాలో రానా పోలీస్‌ కానిస్టేబుల్‌గా నటిస్తుండగా, సాయిపల్లవి నక్సలైట్‌ పాత్ర పోషిస్తోందనీ ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారట. 

 

లేటెస్టుగా సాయిపల్లవి 'పడి పడి లేచె మనసు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టోటల్‌ రిజల్ట్‌ అంతంత మాత్రమే అయినా, నటన పరంగా సాయిపల్లవికి ఎప్పటిలాగే మంచి మార్కులు పడ్డాయి. అలాగే తమిళంలో ధనుష్‌తో నటించిన 'మారి 2' చిత్రం కూడా మంచి టాక్‌ సంపాదించుకుంది. ఈ సినిమాలో సాయి పల్లవి ఆటో డ్రైవర్‌గా మాస్‌ లుక్‌తో ఆకట్టుకుంది. 

 

ఒకేసారి విడుదలైన ఈ రెండు సినిమాలూ నటన పరంగా సాయిపల్లవికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. లేటెస్ట్‌ సమాచారమ్‌ ప్రకారం ప్రచారంలో ఉన్న రానా - వేణు ఉడుగుల కాంబినేషన్‌ మూవీలో సాయిపల్లవి పాత్ర ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. అయితే ఇది వట్టి ప్రచారమేనా.? లేక నిజంగానే సాయిపల్లవి నక్సలైట్‌ అవతారమెత్తనుందా.? అనేది చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS