స్టార్ హీరోయిన్ పోస్టర్‌పై కనిపిస్తే... ఆ హడావుడే వేరు. సినిమాకి కొత్త కళ వస్తుంది. మార్కెట్ కూడా పెరుగుతుంది. అందుకే పారితోషికం ఎక్కువైనా.. స్టార్ హీరోయిన్ల వెంట పడుతుంటారు నిర్మాతలు. దానికి తగినట్టు నిర్మాతలకీ గిట్టుబాటు అయిపోతుంటుంది. తమన్నా లాంటి కథానాయిక సినిమాలో ఉంటే ఆ ఎఫెక్ట్ ఉలా ఉంటుందో చెప్పడానికి 'నా నువ్వే' సినిమా ఓ ఉదాహరణం.
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. తమన్నా నాయిక. ఇది వరకు కల్యాణ్ రామ్ సినిమా అంటే విడుదలైన తరవాతే శాటిలైట్ జరిగేది. హిందీ డబ్బింగ్ హక్కులూ అంతంతమాత్రంగానే దక్కేవి. అయితే 'నా నువ్వే' శాటిలైట్ మాత్రం సెట్లో ఉండగానే అమ్ముడైపోయింది. జెమినీ టీవీ రూ.4.75 కోట్లకు 'నా నువ్వే' శాటిలైట్ దక్కించుకుంది.
హిందీ రైట్స్ రూపంలో మరో మూడు కోట్లు వచ్చాయి. 'బాహుబలి'తో తమన్నా బాలీవుడ్‌లో పాపులర్ అయిపోయింది కదా. అందుకే ఈ స్థాయి రేట్లు దక్కాయన్నమాట. తమన్నా ఎఫెక్ట్ నిజంగానే అదిరిపోయింది కదూ.