తేజు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు. తాను నవ్వుతూ ఉంటాడు. అంత హాయిగా కల్మషం లేకుండా ఉండే తేజు నవ్వు చూసి ఎంత సీరియస్ కండిషన్లో ఉన్నా నవ్వు రాక మానదు. అందుకే డబ్బులిచ్చి భయపడాల్సిన అవసరమేంటని ప్రశ్నించాడు సాయిధరమ్ తేజ. అంటే హారర్ సినిమాలపై తేజు స్పందన ఇదన్న మాట. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉండే సాయిధరమ్‌కి భయమంటే చాలా చాలా భయమట. హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశమొచ్చినాసరే, హర్రర్ ఫిలింస్ చేయడట. సరదాగా నవ్వుతూ, నవ్వించే సినిమాలే చేస్తూ ఉంటాడట. పూర్తి కామెడీ సినిమాలో నటించడానికైనా రెడీనే కానీ, భయపెట్టే సినిమాల్లో మాత్రం అస్సలు నటించనంటున్నాడు. నటుడన్నాక అన్ని పాత్రల్లోనూ కనిపించాలి. కానీ ఇష్టంలేని పాత్రల్లో కష్టంగా చేయడం కూడా ఇబ్బందే. అందుకే వాటి జోలికి పోనంటున్నాడు మెగా మేనల్లుడు. తేజు డాన్సులు గురించి తెలిసిందే. అయితే 'విన్నర్'లో డాన్సులు ఇంకా ఇరగదీసేశాడట. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా చేశారు. ఈ సందర్భంగా తేజు తనపై వచ్చిన హీరోయిన్లతో ఎఫైర్స్ అనే గాసిప్స్ కొట్టి పారేశాడు. తోటి హీరోలతోనూ, హీరోలతోనూ, టెక్నీషియన్లు, ఇతర నటీనటులందరితోనూ సరదాగా ఉండటం తనకిష్టమంటాడు. హీరో హీరోయిన్ల మధ్య స్నేహాన్ని ఎఫైర్‌గా ఎలా చూస్తారని ప్రశ్నించాడు సాయిధరమ్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'విన్నర్'తో త్వరలోనే మన ముందుకు వస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.