బాలీవుడ్ లో క్రీడాకారుల జీవితాల పైన సినిమాలు రావడం చాలా సర్వసాధారణం అయింది. అవి బాక్స్ ఆఫీస్ వద్ద కూడా హిట్ అవుతుండడంతో మరింతమంది క్రీడాకారుల పైన సినిమాలు రావడం మొదలైంది.
అందులో భాగంగానే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన సైనా నెహ్వాల్ జీవితం పైన ఓ సినిమాని రూపొందించాలి అని ఆ టైటిల్ పాత్రకి శ్రద్ధా కపూర్ ని ఎంపిక చేసుకున్నారు. శ్రద్ధా కూడా గోపీచంద్ అకాడమీకి వచ్చి సైనా నెహ్వాల్ వద్ద ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయింది అంటూ వార్తలు మొదలయ్యాయి.
సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ లో సరైన నేర్పు సాధించలేకపోవడం వల్లనే ఈ చిత్రాన్ని పక్కన పెట్టినట్టు వార్తలు రాగా, ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు కేవలం శ్రద్ధా కపూర్ బ్యాడ్మింటన్ సాధనకి సమయం సరిపోకపోవడం వల్లనే చిత్రం మొదలుకాలేదు అని తెలుస్తున్నది.
కొంచెం జాప్యం జరిగిన కచ్చితంగా సినిమా అయితే ఉంటుంది అని మాత్రం యూనిట్ ధీమాగా చెబుతున్నారు.