లవ్ అఫైర్ అంటే ఖచ్చితంగా అక్కడ క్యూరియాసిటీ నెలకొంటుంది. అదే సెలబ్రిటీల లవ్ అఫైర్స్ అయితే ఆ క్యూరియాసిటీ మరింత పెరుగుతుంది. ఇంతకీ ఇప్పుడు లవ్ అఫైర్ ఎవరిదనే కదా మీ సందేహం. ఆగండాగండి అక్కడికే వస్తున్నాం.
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ లవ్‌లో పడిందట. కొత్తగా లవ్‌లో పడడం కాదండోయ్ బాబూ. గత పదేళ్లుగా తన సహచరుడు తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన పారుపల్లి కశ్యప్‌ని సైనా లవ్ చేస్తోందట. వీరిద్దరూ గోపీచంద్ బ్యాడ్మింటన్ ఆకాడమీలోనే శిక్షణ తీసుకున్నారు. కలిసి బోలెడన్ని టోర్నమెంట్స్‌లో పాల్గొన్నారు. పతకాలు సాధించారు. అంతంత మాత్రంగా ఉన్న వీరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి పీటల దాకా చేరిందట.
ఇరు కుటుంబాల పెద్దల్ని ఒప్పించి వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారట. డిశంబర్ 16న వీరి పెళ్లికి మూహూర్తం కుదిరినట్లుగా సమాచారమ్. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో సైనా నెహ్వాల్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రలో ఈ బయోపిక్ తెరకెక్కుతోంది.
సడెన్‌గా తెరపైకి వచ్చిన సైనానెహ్వాల్ ప్రేమ, పెళ్లి వార్తతో ఈ బయోపిక్‌లో చిన్నా, చితకా మార్పులు చేయాల్సి ఉంటుందేమో చూడాలిక.!