'పోటుగాడు' సినిమాతో 'ప్యార్ మే పడిపోయానే..' అంటూ తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ సాక్షీ చౌదరి. ఆ సినిమాలో మంచు మనోజ్‌తో హాట్ హాట్ స్టెప్పులేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో 'జేమ్స్ బాండ్ నేను కాదు నా పెళ్లాం' తదితర చిత్రాల్లో నటించింది. ఇటీవల 'ఆక్సిజన్' సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లోనూ నర్తించింది. ఈ ముద్దుగుమ్మకి తొలి సినిమా నుండీ గ్లామర్‌లో పెద్దగా హద్దుల్లేవనే చెప్పాలి. మంచి హైటూ, ఆకట్టుకునే పర్సనాలిటీ కావడంతో ఎలాంటి కాస్ట్యూమ్ అయినా చక్కగా సూటైపోతుంది.
అయితే తాజాగా ఈ బ్యూటీ స్పెషల్‌గా ఫోటో షూట్స్ చేయించుకుని ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఆ ఫోటోలు చూస్తున్న కుర్రకారు అమ్మడి హాట్ అందాల దాడిని తట్టుకోలేక సొమ్మసిల్లిపోతున్నారంటే నమ్ముతారా? నమ్మకపోతే మీరే చూడండి ఈ తాజా పిక్‌ని. ఇది బికినీనే. కానీ ఈ బికినీలో అమ్మడి అందాలు కెవ్వు కేకో అన్నట్లుగా లేవూ. హాట్నెస్ సంగతి పక్కన పెడితే, బికినీ డిజైన్ చాలా బాగుందట. ఇది నెటిజన్స్ కామెంట్ అన్నమాట.
గులాబీ రేకుల్లాంటి ఈ అందమైన బికినీలో ఈ అందాల భామ సొగసులు చూడ తరమా! అనాలనిపిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ బ్యూటీ 'సువర్ణసుందరి' అనే పీరియాడిక్ మూవీలోనూ, 'ఊళ్లో పెళ్లి కుక్కల హడావిడి' అనే ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలూ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.