'భలే భలే మగాడివోయ్' సినిమా తెలుగులో ఎంత మంచి విజయం సాధించిందో తెలిసిందే. మతిమరుపు ఉన్న కుర్రాడిలా నేచురల్ స్టార్ నాని తన నటనతో నవ్వులు పూయించాడు ఈ సినిమాలో. ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్య హీరోగా స్టూడియో గ్రీన్ పతాకంపై ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారు. తాజాగా సినిమా షూటింగ్ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆర్య సరసన ఈ సినిమాలో సాయేషా సైగల్ హీరోయిన్గా నటిస్తోంది. జ్ఞాన్వేల్ రాజా నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.
'అఖిల్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ సాయేషా సైగల్. ఆ సినిమా బెడిసికొట్టడంతో ఈ బ్యూటీకి తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. సో తమిళంలో పాగా వేసింది. తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ, బిజీగానే గడుపుతోంది. తెలుగులో లావణ్య త్రిపాఠి నటించిన పాత్రలో సాయేషా నటిస్తోంది. సాయేషా మంచి డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ డాన్స్‌కి ప్రాధాన్యత ఉంటుంది. అరదుకే తమిళ వెర్షన్లో హీరోయిన్ డాన్స్ మరింత ఎలివేట్ అయ్యేలా సాయేషాపై ఎక్కువ డాన్స్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
మతిమరుపు లోపం ఉన్న నాని పాత్రలో ఆర్య నటిస్తున్నాడు. ఈ సినిమాని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. క్రేజీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి టైటిల్ కూడా అంతే క్రేజీగా పెట్టారు 'గజనీకాంత్' అని. తెలుగు వెర్షన్‌తో పోలిస్తే, తమిళ వెర్షన్ మరింత నవ్వులు పూయిస్తుందనీ చిత్ర యూనిట్ చెబుతోంది.