స్టార్ హీరో సినిమా అనగానే కొన్ని లెక్కలుంటాయి. హంగులూ, ఆర్భాటాలూ అవసరం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో. స్టార్ హోదాకు తగిన కథానాయికనే రంగంలోకి దించాల్సివస్తుంది. స్టార్ హీరోల పక్కన కొత్తమ్మాయిలకు అంత ఈజీగా ఛాన్స్ దొరకదు. అయితే... పవన్ కల్యాణ్ సినిమాలో ఓ కొత్తమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. తనే సాక్షి వైద్య.
పవన్ కల్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ సినిమా కోసం సాక్షి వైద్యని కథానాయికగా ఫిక్స్ చేశార్ట. తను ముంబై మోడల్. సినిమాల్లో పనిచేసిన అనుభవం లేదు. తెలుగులో అయితే పూర్తిగా కొత్త. పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోయిన్ పక్కన సాక్షి సరిపోతుందా? అనేది పెద్ద డౌటు. స్టార్ హీరోయిన్లు అందుబాటులో లేకపోవడం వల్ల సాక్షితో సరిపెట్టుకుంటున్నారా? లేదంటే కథకు న్యాయం చేస్తుందని తీసుకుంటున్నారా? అనేది తెలియడం లేదు. కాకపోతే... పవన్ లాంటి స్టార్ పక్కనకొత్తమ్మాయి ఎప్పుడూ రిస్కే. మరి... సురేందర్ రెడ్డి ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడో?
అయితే ఈసినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి.. సురేందర్ రెడ్డి ఆలోచన మారొచ్చు. ప్రస్తుతం అఖిల్ తో `ఏజెంట్` సినిమాని రూపొందిస్తున్నాడు సూరి. ఆ తరవాత పవన్ సినిమానే పట్టాలెక్కుతుంది.