బ‌న్నీ పాట‌కు స‌ల్మాన్ స్టెప్పులు.

By Gowthami - June 08, 2020 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్ క‌థ‌ల్ని, ఇక్కడి ట్రెండ్స్‌ని వీలైనంత వ‌ర‌కూ వాడుకుంటోంది బాలీవుడ్‌. ఇప్పుడు పాటల్నీ ఎత్తుకెళ్లిపోతోంది. ముఖ్యంగా సౌత్ స్ట‌ఫ్ అంటే ఎంతో ఇష్ట‌ప‌డే స‌ల్మాన్ ఖాన్‌.. మ‌రోసారి ఇక్క‌డి పాట‌పై త‌న మ‌మ‌కారాన్ని చూపించుకున్నాడు. స‌ల్మాన్ ఖాన్ - ప్ర‌భుదేవా కాంబినేష‌న్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'రాధే'. మే 22న ఈ సినిమా విడుద‌ల కావాల్సింది. కానీ లాక్ డౌన్ వ‌ల్ల కుద‌ర్లేదు.

 

థియేట‌ర్లు ఎప్పుడు ఓపెన్ చేసినా.. ముందుగా వ‌చ్చే బాలీవుడ్ స్టార్ చిత్రం ఇదే. అయితే.. ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ రీమిక్స్ గీతాన్ని రూపొందిస్తున్న‌ట్టు టాక్‌. 'దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'లో 'సీటీమార్' అనే గీతం చాలా పాపుల‌ర్ అయ్యింది. ఈ పాట‌ని 'రాధే' కోసం రీమిక్స్ చేస్తున్నార్ట‌. దేవిశ్రీ నే ఆ రీమిక్స్ ప‌నులూ చూసుకుంటున్నార‌ని టాక్‌. ఇది వ‌ర‌కు కూడా బ‌న్నీ సినిమాలోని ఓ పాట‌ని స‌ల్మాన్ రీమిక్స్ చేశాడు. 'రింగ రింగ‌' పాట‌ని `డింక‌చిక‌.. డింక‌చిక‌`గా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు వినిపించాడు. ఇప్పుడు.. మ‌రోసారి బ‌న్నీ పాట‌పై మ‌న‌సు ప‌డ్డాడ‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS