బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కి కృష్ణజింకలని వేటాడిన కేసులో జోధపుర్ కోర్టు ఐదేళ్ళ శిక్ష విధించడం ఆ తరువాత ఆ కేసులో బెయిల్ పైన విడుదలవ్వడం కూడా జరిగిపోయింది.
ఈ తరుణంలో సల్మాన్ ఖాన్ ఈరోజు జోధపుర్ లోని స్థానిక సెషన్స్ కోర్టుకి లో తనని ఈ కేసు నుండి నిరపరాదిగా ప్రకటిస్తూ శిక్షని ఎత్తివేయాల్సిందిగా ఒక పిటీషన్ ని దాఖలు చేశారు. ఇక ఆ పిటీషన్ ని కోర్టు స్వీకరించి తదుపరి విచారణ కి జూలై 17కి ఈ కేసుని వాయిదా వేసింది.
మరి ఈ సెషన్స్ కోర్టు ఆయన పైన వేసిన ఐదేళ్ళు శిక్ష నుండి విముక్తి కలిపిస్తుందా లేదా అనేది తెలియాలంటే జూలై వరకు ఆగాల్సిందే. ఇదే సమయంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం రేస్ 3 షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.
అంతకముందు ఆయన సినిమాల చిత్రీకరణ కోసం విదేశాలు వెళ్ళడానికి కోర్టు నుండి ప్రత్యేక అనుమతి పొందడం జరిగింది.