దక్షిణాది కథలంటే సల్మాన్ ఖాన్‌కి ఎంతో మక్కువ. ఇక్కడ హిట్ అయిన సినిమాల్ని రీమేక్ చేసి - అక్కడ కోట్లు కుమ్మరించుకుంటుంటాడు. మహేష్ బాబు పోకిరిని బాలీవుడ్లో రీమేక్ చేసింది సల్లూ భాయే. ఇప్పుడు `మహర్షి` రీమేక్‌పై కూడా సల్మాన్ ఖాన్ కన్ను పడిందని, ఈ సినిమానీ రీమేక్ చేయబోతున్నాడని వార్తలొస్తున్నాయి. వీటిపై సల్మాన్ ఖాన్ స్పందించాడు. మహర్షి సినిమాని ఇంత వరకూ చూడలేదని, అలాంటప్పుడు రీమేక్ చేయాలన్న ఆలోచన ఎందుకు వస్తుందని? ఎదురు ప్రశ్నిస్తున్నాడు సల్మాన్.
నిజానికి తనకు తెలుగు సినిమాలు చూడడం చాలా ఇష్టమని, అయితే.. ఈమధ్య అందుకు సమయం చిక్కడం లేదని, అఖిల్ నటించిన `హలో` సినిమాని మాత్రమే చూశానని, కనీసం `బాహుబలి 2` కూడా చూడలేకపోయానని క్లారిటీ ఇచ్చాడు. సో.. మహర్షి రీమేక్ పై ఇప్పటి వరకూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే అన్నమాట. ఒకవేళ మహర్షి సినిమా చూస్తే... అప్పుడు సల్మాన్ ఖాన్ మనసు మార్చుకుంటాడేమో చూడాలి.