సల్మాన్‌తో ప్రభుదేవా ఏం మ్యాజక్‌ చేస్తాడో!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ - ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. అదే 'దబాంగ్‌ 3'. సల్మాన్‌ఖాన్‌ హీరోగా వచ్చిన 'దబాంగ్‌' సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. ఈ సారి రాబోతున్న 'దబాంగ్‌ 3'పై కూడా అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. 

ఓ పక్క తమిళంలో హీరోగా సినిమాలు చేస్తూనే, హిందీలో దర్శకుడిగా కూడా బిజీగా ఉన్నాడు ప్రభుదేవా. ప్రభుదేవా అంటే సల్మాన్‌ఖాన్‌కి ఎంతో ఇష్టం. అందుకే సల్మాన్‌ అడిగాడనీ ఆయనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట ప్రభుదేవా. అయితే 'దబాంగ్‌' రెండు సిరీస్‌లోనూ సల్మాన్‌ ఖాన్‌ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గానే కనిపించాడు. అలాగే ఈ మూడో సిరీస్‌లో కూడా పోలీసాఫీసర్‌గానే కనిపిస్తాడు అనీ ప్రభుదేవా చెప్పారు. అలాగే నటీనటులు కూడా సేమ్‌ టు సేమ్‌ అట. అయితే స్టోరీ, డైరెక్టరే మారుతున్నారు.. అని ప్రభుదేవా అన్నారు. 

ఆల్రెడీ స్టోరీ లైన్‌ సల్మాన్‌కి వినిపించాడట. సల్మాన్‌ ఈ స్టోరీ పట్ల చాలా ఆశక్తితో ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. ఓ పక్క ప్రభుదేవా హీరోగా బిజీగా ఉంటూనే డైరెక్టర్‌గానూ, ప్రొడ్యూసర్‌గానూ కూడా అభిరుచి గల సినిమాలను రూపొందిస్తుంటారు. తమిళంలో ప్రభుదేవా హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి 'చార్లీ చాప్లిన్‌ 2'. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ చిత్రంగా రూపొందుతోంది ఈ చిత్రం. సీనియర్‌ తమిళ నటుడు ప్రభు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆదాశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇవి కాక హిందీలో కూడా ప్రభుదేవా హీరోగా ఓ చిత్రం ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. తాజాగా సల్మాన్‌తో చేయబోతున్న 'దబాంగ్‌ 3' ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS