కెప్టెన్సీ దక్కించుకున్న శ్రీముఖి, ఫస్ట్ టార్గెట్ చేసింది బాబా భాస్కర్‌నే. గతంలో బాబా భాస్కర్ కెప్టెన్ అయినప్పుడు శ్రీముఖితో ఓ ఆట ఆడుకున్నాడు. గార్డెన్ ఏరియాలోని సోఫాలు క్లీన్ చేయించి అక్కడి కుర్చీలు గట్రా సర్దించి కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. కెప్టెన్ అయిన బాబా తనకు చుక్కలు చూపిస్తున్నాడే.. అంటూ అప్పుడు శ్రీముఖి కూడా అంతే ఓవరాక్షన్ చేసింది. అది మనసులో పెట్టుకుని శ్రీముఖి, బాబాపై రివేంజ్ తీర్చుకుంది. అంతేగా.. 'ఎవ్రీ డాగ్ హేజ్ వన్ డే..' అంటుంటారు కదా.. అలా ఇప్పుడు శ్రీముఖికి టైమొచ్చింది. విజృంభించింది.
బాబా భాస్కర్ని కిచెన్‌లోకి తీసుకెళ్లి, ఇక్కడ ఈ క్లాత్ ఉండకూడదు. ఇక్కడ ఆ డస్ట్ ఉండకూడదు. కిచెన్ క్యాబిన్‌పై ఆయా వస్తువులు ఉండరాదు.. అంటూ రూల్స్ పెట్టి, అప్పటికప్పుడు అదంతా క్లీన్ చేయించింది. విషయం గ్రహించిన బాబా భాస్కర్ మారు మాట్లాడకుండా, కామ్‌గా శ్రీముఖి చెప్పిన పనులన్నీ పూర్తి చేశాడు. ఇక కెప్టెన్సీ దక్కించుకున్న శ్రీముఖి హౌస్‌లో ఇంకెలాంటి రూల్స్ పెడుతుందో చూడాలిక.
అసలే రాములమ్మ. ఆ పై కెప్టెన్. మరి కెప్టెన్‌గా ఈ వారం రోజులు శ్రీముఖి హౌస్‌లో ఎలాంటి హల్చల్ చేస్తుందో మెల్ల మెల్లగా చూడాలిక. ఇదిలా ఉంటే, కెప్టెన్సీ దక్కించుకుంది కాబట్టి, ఈ వారం ఎలిమినేషన్స్ నుండి శ్రీముఖి ఆల్ మోస్ట్ సేఫ్ అయిపోయినట్లే.. అనే విషయాన్ని కూడా గమనించాలి. ఇక ఎలిమినేషన్ లిస్టులో బాబా భాస్కర్, రవికృష్ణ, వరుణ్ సందేశ్ ఉన్నారు.