బుల్లితెర రాములమ్మగా పేరున్న శ్రీముఖికి బిగ్‌హౌస్‌లో కూడా ప్రత్యేక స్థానం ఉంది. బిగ్‌బాస్ జింగిల్స్‌లో 'బిగ్‌బాస్‌కే బాసువమ్మా..' అంటూ లైన్ రాయించుకుని బిగ్‌బాస్‌కి నిజంగా బాస్‌లానే ఫీలయిపోయింది. అయతే ఈ మధ్య శ్రీముఖి హవా కాస్త తగ్గినట్లుగా కనిపించింది హౌస్‌లో. తాజాగా దక్కించుకున్న కెప్టెన్సీతో ఆ లోటు తీర్చేసుకోనుందేమో శ్రీముఖి చూడాలి. కలర్‌ఫుల్ కెప్టెన్ టాస్క్‌లో తనకిచ్చిన రంగు బౌల్‌ని రెండు చేతులతో రంగు కింద పడకుండా పట్టుకుని కష్టపడి కెప్టెన్సీ సాధించింది.
అయితే, తనతో పాటు, కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ పడిన రవి, బాబా భాస్కర్, శివజ్యోతిలు చివరి వరకూ ఆ బౌల్‌ని కాపాడుకోలేకపోవడంతో మధ్యలోనే టాస్క్ నుండి వైదొలిగారు. అయితే రవికృష్ణ కూడా కెప్టెన్సీ కోసం కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడు. కానీ, శ్రీముఖితో కుమ్మక్కయిన వితిక, రవికృష్ణ బౌల్‌ని చేతితో ఎత్తేయడంతో రవికృష్ణ ఓడిపోయాడు. శ్రీముఖి గెలిచింది. అలా 67వ రోజు శ్రీముఖికి తను కోరుకున్న కెప్టెన్ పదవి దక్కింది. ఇక కెప్టెన్సీ దక్కించుకోవడానికి శత విధాలా కష్టపడిన రవికృష్ణకు చాలా నిరాశ ఎదురైంది. కెప్టెన్ అయితే, ఈ వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకోవచ్చన్న ఆలోచన రవికృష్ణలోనూ ఉంది.
కానీ, కెప్టెన్సీ దక్కకపోవడంతో, ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి తనకే ఎక్కువ ఛాన్స్ ఉందన్న అనుమానం, భయం వ్యక్తం చేశాడు తోటి హౌస్ మేట్స్ వద్ద రవికృష్ణ. అనుమానించినట్లు ఈ వారం ఎలిమినేషన్ రవికృష్ణదే అని ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోయింది. బిగ్ ఎలిమినేషన్‌కి సంబంధించి, సోషల్ మీడియా టాకే ఫైనల్ అవుతోంది. సో రవికృష్ణ ఎలిమినేషన్ కన్‌ఫామేనా? లెట్స్ వెయిట్ అండ్ సీ.