'రంగస్థలం' సినిమాలో కుమార్‌బాబుగా చరణ్‌కి అన్నయ్య పాత్రలో నటించిన ఆది పినిశెట్టి తర్వాత సమంతతో జత కట్టనున్నాడు. 'రంగస్థలం'లో బావ బావ అంటూ ఆదిని పిలిచిన సమంత, ఇప్పుడు ఆది పినిశెట్టితో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాను తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రూపొందించనున్నారట.
హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆది పినిశెట్టి కథ నచ్చి, క్యారెక్టర్ నచ్చితే, విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించేందుకు వెనుకాడడు. అలాగే 'సరైనోడు'లో విలన్ పాత్రలో నటించి శభాష్ అనిపించుకున్నాడు ఆది. తాజాగా 'రంగస్థలం'లో చరణ్‌కి అన్నయ్యగా నటించాడు కాదు కాదు జీవించాడు. అందుకే చరణ్, ఆది నిజంగా నాకు అన్నయ్య అని మురిసిపోయాడు. అలాగే ఆల్రెడీ అన్నయ్య ఉన్న ఆదికి రియల్ తమ్ముడు చరణ్ అని మురిసిపోతున్నాడు. అలా 'రంగస్థలం'తో ఓ మంచి అన్నదమ్ములిద్దరు ఒక్కటయ్యారు. సినిమాలో అన్నదమ్ముల్లా వీరిద్దరి మధ్యా నడిచిన సన్నివేశాలు కంట తడి పెట్టిస్తాయి. సినిమా కోసమన్నట్లుగా కాకుండా, ఈ పాత్రలు కూడా చాలా నేచురల్‌గా లైవ్‌గా ఉంటాయి. ఆ పాత్రలను సృష్టించిన సుకుమార్ చేసిన మాయాజాలమిది. ఆ పాత్రలను అంత విజయవంతంగా పోషించిన చరణ్, ఆదిల గొప్పతనమది.
ఇకపోతే, ఈ సినిమాతో ఆది హీరోగా రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతోండగా, ఇంకో సినిమాలో తాప్సీ. రితికా సింగ్ ఆదితో జత కడుతున్నారు. ఈ సినిమా కూడా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోంది.